కోవిడ్ ఎఫెక్ట్.. త్రిపురలో 'ఎస్మా' అమలు..

కోవిడ్ ఎఫెక్ట్.. త్రిపురలో ఎస్మా అమలు..
x
Highlights

కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) వ్యాప్తి నేపథ్యంలో త్రిపుర ప్రజా ప్రయోజనాల కోసం ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎస్మా) ను అమలు చేసింది...

కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) వ్యాప్తి నేపథ్యంలో త్రిపుర ప్రజా ప్రయోజనాల కోసం ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎస్మా) ను అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా పబ్లిక్ కన్జర్వెన్సీ, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, పారిశుధ్యం, నీటి సరఫరా, ఆస్పత్రులు, అలాగే రక్షణకు సంబంధించిన సేవలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. గురువారం అర్ధరాత్రి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను అమలు చేసింది.. మధ్యప్రదేశ్ తరువాత ఎస్మా ప్రయోగించిన రెండవ రాష్ట్రంగా త్రిపుర అవతరించింది.

'త్రిపురలో తక్షణమే అమలయ్యే విధంగా ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎస్మా) ను అమలు చేసింది' అని రాష్ట్ర ముఖ్యమంత్రి బిపాబ్ కుమార్ దేబ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్ -19 కు సంబంధించి.. సెక్రటరీ మరియు పై ర్యాంకింగ్ అధికారులకు మాత్రమే మీడియాతో మాట్లాడటానికి అనుమతి ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) యూనిట్ల కొరత ఉందని కొందరు నర్సులు ఫిర్యాదు చేయడంతో 18 మంది నర్సులకు షో-కాజ్ నోటీసులు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories