సంచలనం రేపిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్య

సంచలనం రేపిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్య
x
Highlights

పశ్చిమబెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి అరంగ్ కియారణ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హ్యత ఆ రాష్ట్రలోనే సంచలం రేపింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ బసుదేవ్ మండల్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.

పశ్చిమబెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి అరంగ్ కియారణ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హ్యత ఆ రాష్ట్రలోనే సంచలం రేపింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ బసుదేవ్ మండల్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. బసుదేవ్ హత్యపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్లు మూసివేసి బైటాయించారు.

బీజేపీకి చెందిన వాళ్లే తమ నాయకుడిని హత్య చేశారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే బసుదేవ్ హత్య జరిగివుంటుందని ఆ పార్టీ ఎంపీ దిబయెందు ఆరోపించారు. గత రాత్రి బసుదేవ్ తన కూతురి ఇంటికి వెళ్లాడు. కొందరు దుండగులు ఇంటికి చొచ్చుకు వెళ్లి కత్తులతో అతికిరాతకంగా హతమార్చారు. దీనిపై బసుదేవ్ కుమారుడు అనూప్ మండల్ మాట్లాడతూ.. కొందరు తన తండ్రిని బెదిరించారని తెలిపాడు. బీజేపీ చెందిన నాయకులే కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించాడు. బసుదేవ్ హత్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories