ఈశాన్య భారత్‌లో భూ ప్రకంపనలు

ఈశాన్య భారత్‌లో భూ ప్రకంపనలు
x
Highlights

అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూ ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. కొన్ని నిమిషాల...

అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూ ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. కొన్ని నిమిషాల పాటు భూమి కంపించింది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటా నగర్‌కు 180కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది.అలాగే నేపాల్‌లోని కాట్మాండులో కూడా భూమి కంపించింది. అక్కడ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories