Tree Ambulance Service in Chandigarh: మొక్క‌ల సంర‌క్ష‌ణ కోసం 'ట్రీ అంబులెన్స్'

Tree Ambulance Service in Chandigarh:  మొక్క‌ల సంర‌క్ష‌ణ కోసం ట్రీ అంబులెన్స్
x
tree ambulance
Highlights

Tree Ambulance Service in Chandigarh: క‌రోనా కష్ట కాలంలో మ‌న‌షులకే అంబులెన్స్ దొరకడం చాలా క‌ష్టం. అలాంటిది రోగాల బారిన ప‌డిన మొక్క‌లు, వృక్షాల కోసం చండీగఢ్ పర్యావణ శాఖ అంబులెన్స్ సేవ‌ల‌ను ప్రారంభించింది.

Tree Ambulance Service in Chandigarh: క‌రోనా కష్ట కాలంలో మ‌న‌షులకే అంబులెన్స్ దొరకడం చాలా క‌ష్టం. అలాంటిది రోగాల బారిన ప‌డిన మొక్క‌లు, వృక్షాల కోసం చండీగఢ్ పర్యావణ శాఖ అంబులెన్స్ సేవ‌ల‌ను ప్రారంభించింది. కుళ్ళిన, కీట‌కాల ద్వారా అనారోగ్యానికి గురైన చెట్లను ర‌క్షించ‌డానికి 'ట్రీ అంబులెన్స్' వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

ఈ సంద‌ర్భంగా పర్యావరణ శాఖ అధికారి దేవేంద్ర దలై మీడియాతో మాట్లాడుతూ.. మొక్క‌లు, వృక్షాల‌ను ర‌క్షించేలానే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ అంబులెన్స్ సేవ‌ను ప్రారంభించాము. క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో రోగాల బారిన ప‌డిన‌ వృక్షాలకు సరైన చికిత్స కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం ఓ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. వాటి చికిత్స నిమిత్తం ఓ బృందాన్ని కూడా వెంటనే పంపుతామని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories