అత్యవసర పనులుంటే టిక్కెట్టు ఓకే.. అవసరమైతే ప్రత్యేక రైళ్లు

అత్యవసర పనులుంటే టిక్కెట్టు ఓకే.. అవసరమైతే ప్రత్యేక రైళ్లు
x
Highlights

లాక్ డౌన్ పుణ్యమాని పూర్తి షట్ డౌన్ అయిన రైల్వేలను దారిలో పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

లాక్ డౌన్ పుణ్యమాని పూర్తి షట్ డౌన్ అయిన రైల్వేలను దారిలో పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులకు భద్రతతో పాటు భరోసా ఇచ్చి ప్రయాణం సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా అవసరాన్ని బట్టి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అత్యవసర పనులను బట్టి టిక్కెట్టు బుక్ చేసుకుంటే తప్పనిసరిగా కన్ఫామేషన్ అవుతుందని భరోసా ఇస్తోంది.

అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్‌లో 3 రైళ్లు మినహాయించి మిగిలిన వాటిల్లో బెర్తులు జూన్, జూలై నెలలకు గానూ అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్లలో బెర్తులు ఖాళీ ఉంటాయని.. టికెట్ బుక్ చేసుకునేవారికి ఖచ్చితంగా కన్ఫామేషన్ అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

అవసరాన్ని బట్టి పలు రూట్లలో రైళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వేస్టేషన్లలో తగిన చర్యలు తీసుకుంటున్నామని.. ప్రయాణీకులు అందరూ కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వీకే యాదవ్ వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories