Tejas Express : విమాన ప్రయాణ అనుభూతి.. తేజస్ రైళ్లలో!

Tejas Express : విమాన ప్రయాణ అనుభూతి.. తేజస్ రైళ్లలో!
x
Highlights

విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, వారిని కావలసిన ఆహార పదార్థాలను అందించడానికి గగన సఖులు ఉంటారు.

విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, వారిని కావలసిన ఆహార పదార్థాలను అందించడానికి గగన సఖులు ఉంటారు. ప్రయాణికులు వారి గమ్యస్ధానం చేరేంత వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. విమానాలు టేకాఫ్, ల్యాండిగ్ అయ్యే సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. వారికి కావలసిన ఆహార పదార్థాలు అందిస్తుంటారు. అలా ప్రయాణికుల మంచిచెడ్డలు చూసుకునే గగన సఖులను ప్రయాణికులు కూడా ఎంతో మర్యాదగా చూస్తారు. ఇదే కొణంలో ఆలోచించిన రైల్వే శాఖ ఇప్పుడు రైల్ హోస్టెస్ లను కూడా నియమించారు. కానీ విమాన ప్రయాణికులంత హుందాగా రైలు ప్రయాణికులు వారితో వ్యవహరించడం లేదు.

ఇటీవలి కాలంలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ప్రయాణికులకు తగిన పారితోషకం ఇస్తాం అని ఐఆర్ సీటీసీ ఒక ట్రెయిన్ టైం టైమింగ్ మీద ఛాలెంజ్ చేసింది. ఇప్పుడే అదే రైలులో ఈ ట్రైన్ హోస్టెస్ లను నియమించారు. ఇంతకీ అది ఏ ట్రైన్ అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు ఈ రైలు వివరాలు తెలసుకుందాం రండి.

ఇటీవలి కాలంలో రైల్వే శాఖ కార్పోరేట్ రైళ్లను ప్రారంభించిన రైళ్లలో 'తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌' కూడా ఒకటి. ఈ రైలు సర్వీస్ ను ముందుగా 2019 అక్టోబర్ నెలలో ప్రారంభించారు. దీని మొదటి సర్వీసు లక్నో–న్యూఢిల్లీల మధ్య మొదలైంది. ఈ ట్రైన్ ప్రయాణికుల అభిమానం సంతరించుకోవడంతో జనవరి 19, 2020న అహ్మదాబాద్‌ నుంచి ముంబైకు రెండో సర్వీస్ ను కూడా ప్రారంభించారు. కొత్త హంగులతో ప్రారంభించిన ఈ రైళ్లలో మహిళలకు ఉపాధి కల్పించాలని యోచించారు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్ని ఆచరణలో పెట్టారు. అందమైన మగువలను 'ట్రైన్‌ హోస్టెస్‌ లుగా నియమించారు. విమాన సర్వీసుల్లో ఏ విధంగా సాయం చేస్తారో ఇందులో కూడా అదే విధంగా చేస్తారు. దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఆహార సదుపాయాలలో వీరు సహాయం చేస్తారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

అన్ని సదుపాయాలు అందుకుంటున్న ప్రయాణికులు సౌకర్యంగా ఉన్నప్పటికీ, ట్రైన్‌ హోస్టెస్‌ లు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు తెలుపుతున్నారు. అందంగా అలంకరించుకుని ఉన్న రైలు సఖులతో ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అడక్కుండానే సెల్ఫీలు తీస్తున్నారని, పేరు అడుగుతున్నారని అది వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని తెలుపుతున్నారు. అంతే కాక ఎలాంటి అవసరం లేకపోయినప్పటికీ కావాలని కాలింగ్ బెల్ కొట్టి, వారు వచ్చిన తరువాత ఊరికే నొక్కాం అని చెబుతున్నారన్నారు. అయినప్పటికీ ట్రైన్‌ హోస్టెస్‌ ప్రయాణికులను గట్టిగా వారించలేని పరిస్థితి ఉండడంతో వారు చాలా ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ఇంకొంత మంది రైలు సఖులు మాత్రం ప్రయాణికులు చేసే కొన్ని చేస్టలను తట్టుకోలేక మీ ప్రయాణం మీరు చేయక మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?' అని చికాకు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రయాణం ముగిశాక డ్యూటీ దిగిన ఎయిర్‌ హోస్టెస్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్న రైల్వే శాఖకు వీరు కంప్లెయింట్ ఇస్తున్నారు. దీంతో రియాక్ట్ అయిన రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకుంటామని రైల్ హోస్టస్ లకు తెలిపారు. ఇబ్బంది పెట్టిన ప్రయాణికుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories