ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ ... ఇక ఉండవు పాట్లు

ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ ... ఇక ఉండవు పాట్లు
x
Highlights

మొబైల్ రింగ్ కనీస సమయం 30 సెకండ్లు ఉండాలని ట్రామ్ నూతన నిబంధనలు జారీ చేసింది. అలాగే బ్రాడ్‌బాండ్ మొబైల్ కాల్స్ కనీసం 60 సెంకన్లు ఉండాలని టెలీకాం కంపెనీలకు స్ఫష్టం చేసింది.

మొబైల్ రింగ్ కనీస సమయం 30 సెకండ్లు ఉండాలని ట్రాయ్ నూతన నిబంధనలు జారీ చేసింది. అలాగే బ్రాడ్‌బాండ్ మొబైల్ కాల్స్ కనీసం 60 సెంకన్లు ఉండాలని టెలీకాం కంపెనీలకు స్ఫష్టం చేసింది. టెలికాం కంపెనీలకు మధ్య ఉత్పన్నమవుతున్న వివాదాల నేపథ్యంలో కాల్స్ రింగ్ సమయం కనీస సెంకడ్ల నిబంధలను విధిస్తూ టెలికాం రెగ్యులేటరీ సంస్ద (ట్రాయ్) ఈ నిర్ణయం తీసుకుంది.గతంలో 45 సెకన్లు ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది.

ఆ తర్వాత జీవో దానిని 25 సెకన్లకు తగ్గించింది. దానికి పోటాపోటీగా ఇతర మొబైల్ సంస్థలు కూడా 25 సెకంన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ తీసేలోగా కట్ అవుతుంది. వినియోగదారులు అసహనానికి లోనవుతున్నారు. కొత్తగా ట్రాయ్ కాల్ రింగ్ 30 సెకన్లు ఉండాలనే రూల్ విధించింది. దీనిని అన్ని టెలికం ఆపరేటర్లు తప్పనిసరిగా పాటించాలి తెలిపింది. వినియోగదారుడు కాల్ తీయపోతే వాయిస్ కాల్స్ అలర్ట్ 30 సెకన్లు సమయాభావాన్ని తప్పక పాటించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు టెలికాం ఆపరేటర్ల కొత్త రూల్స్ లో నలిగిపోతున్న వినియోగదారుడికి ట్రాయ్ తీసుకున్నకొత్త నిబంధన కాస్తా ఊరట లభించినట్టే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories