ఉల్లి: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్

ఉల్లి: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్
x
Onion
Highlights

రోజు రోజుకు చుక్కలు తాకుతున్న ఉల్లి ధరలకు కళ్లేం వేసేందుకు కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. అందులో భాగంగా టర్కీ నుంచి 11వేల టన్నుల ఉల్లిపాయలు...

రోజు రోజుకు చుక్కలు తాకుతున్న ఉల్లి ధరలకు కళ్లేం వేసేందుకు కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. అందులో భాగంగా టర్కీ నుంచి 11వేల టన్నుల ఉల్లిపాయలు దిగుమతులు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి ఆదేశాలు ఇచ్చింది. ఎంఎంటీసీ ఇప్పటికే 6వేల టన్నుల ఉల్లిని ఈజిప్ట్‌ నుంచి దిగుమతి చేసింది. కాగా తాజా ఆదేశాలతో మరో 11వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేయనుంది. ఉల్లిధర నియంత్రణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రత్యేక మంత్రుల బృందం ఏర్పాటు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులు చేయాలని నిర్ణయించింది.

కాగా ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, రవాణా శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ కమీటీలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వంద రూపాయలపైకి చేరడంతో ఇతర దేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకొవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా ఉల్లి ఎగమతులపై కూడా నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో 50 నుంచి 60 రూపాయిలకు విక్రయిస్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించేదే. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉల్లి ధరలు చికిన్ ధరల కంటే ఎక్కువగా ఉంన్నాయి. ఢిల్లీ అయితే ఏకంగా కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.500 వరకూ వెళ్లిందంటే మాములు విషయం కాదు. అందుకే చాలా హోటల్లలో ఉల్లిపాయలు వాడడం లేదు. పెద్ద పెద్ద హోటళ్లలో కూడా ఉల్లిపాయలు ఇవ్వడంలేదు. హైదరాబాద్ లాంటి కొన్ని నగరాల్లోని హోటళ్లలో ఆహారంలోకి ఉల్లిపాయలు కావాలంటే స్పేషల్ గా డబ్బులు చెల్లించాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories