నలుగురు లష్కరే తోయిబా సానుభూతిపరుల అరెస్ట్

నలుగురు లష్కరే తోయిబా సానుభూతిపరుల అరెస్ట్
x
Representational Image
Highlights

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుగ్డామ్ జిల్లాలో ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా పోలీసులు, ఆర్మీ యొక్క 53 ఆర్ఆర్ సంయుక్త ఆపరేషన్లో బీర్వాకు చెందిన లష్కరే తోయిబా...

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుగ్డామ్ జిల్లాలో ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా పోలీసులు, ఆర్మీ యొక్క 53 ఆర్ఆర్ సంయుక్త ఆపరేషన్లో బీర్వాకు చెందిన లష్కరే తోయిబా సానుభూతిపరులను అరెస్ట్ చేసింది. ఇందులో టెర్రర్ అసోసియేట్ వాసిమ్ గనీతో పాటు మరో 3 ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (ఓజిడబ్ల్యు) ను కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ సమయంలో అరెస్టు చేశారు.

భద్రతా దళాలు వారి వద్ద నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలోని ఉగ్రవాదులకు ఆశ్రయం మరియు లాజిస్టిక్ సహాయాన్ని అందించడంలో ఈ నలుగురు పాల్గొన్నట్టు సమాచారం అందింది. అరెస్టైన వారిపై బీర్వా పోలీస్ స్టేషన్లో యుఎపిఎ , ఆర్మ్స్ యాక్ట్ సంబంధిత సెక్షన్ల క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కాగా ముగ్గురు ఉగ్రవాద సహచరులను ఫరూక్ అహ్మద్ దార్, మహ్మద్ యాసిన్, అజారుద్దీన్ మీర్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారు బుద్గాం జిల్లాలోని బీర్వా నివాసితులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories