Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకుంటే 2కేజీల టమోటాలు ఫ్రీ

Tomatoes Giving To Corona Vaccination People
x

Corona Vaccine:(File Image)

Highlights

Corona Vaccine: టీకా వేసుకున్న వారందరికీ టమోటాలు ఉచితంగా ఇస్తోంది.

Corona Vaccine: దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా ఒక ఆట ఆడేసుకుంటోంది. టీకా పంపిణీ జరుగుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని మాత్రం నిరోధించలేకపోతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. 'వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు' అంటూ వివిధ ఆస్పత్రుల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్ టీకా తీసుకోండి అని ఎంత ప్రచారం చేసినా ఎవరూ ముందుకు రావడం లేదట ఛత్తీస్ గడ్ లో. టీకా తీసుకుంటే ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రజలలో నుంచి వ్యాక్సిన్ పట్ల ఉన్న అనుమానాలను తొలగించడమే కాకుండా.. టీకా అందరు వేసుకునే విధంగా అక్కడి ప్రభుత్వం ఓ వినుత్న నిర్ణయం తీసుకుంది.

చత్తీస్ గడ్‏లోని పురపాలక శాఖ..

చత్తీస్ గడ్‏లోని పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరోనా టీకా తీసుకున్నవారందరీకి 2కేజీల టమోటాలను అందిస్తున్నామని బీజాపూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. టీకా తీసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని.. రైతుల నుంచి టమోటాలు సేకరించి వాటిని టీకా వేసుకున్న వారికి పంచుతున్నమని తెలిపారు. అటు చత్తీస్ గడ్‏లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 6083 మంది కరోనాతో మరణించారు. ఇక ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మిని లాక్ డౌన్ (వారం రోజులు) విధించగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్య్ఫూ విధించింది.

బెడ్స్, ఆక్సిజన్ కొరతలతో...

మరోవైపు పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎంతోమంది ప్రాణాలను వదులుతున్నారు. కరోనా ముందు ఎవరు తక్కువ కాదంటూ.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories