Petrol and Diesel Price Today: దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన చమురు ధరలు

*లీటర్ పెట్రోలు పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు *హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.73 డీజిల్ రూ.100.51

Shilpa
Updated on: 8 Oct 2021 12:40 PM IST
Today Petrol Price in Hyderabad Delhi Diesel Price Today 08 10 2021
X

దేశవ్యాప్తంగా మారోసారి పెరిగిన చమురు ధరలు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Petrol and Diesel Price Today: దేశవ్యాప్తంగా పెట్రో ధరల మంట కొనసాగుతుంది. వరుసగా నాలుగోరోజూ చమురు ధరలు పెరిగాయి. మొన్నటి నుంచి ప్రతిరోజూ పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి లీటర్ పెట్రోలుపై 30 పైసలు, డీజిల్ పై 35 పైసల చొప్పున వడ్డించాయి.

దీంతో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి ఢిల్లీలో లీటరు పెట్రోల్ 103.54కు చేరగా, డీజిల్ ధర 92.17కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో లీటరు డీజిల్ ధర వందకి చేరుకోగా, లీటరు పెట్రోల్ 107.73కు పెరిగింది.

Shilpa

Shilpa

Next Story