మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన తృణమూల్ కాంగ్రెస్

మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన తృణమూల్ కాంగ్రెస్
x
Highlights

పేస్ బుక్ పోస్ట్ వివాదంలో కాంగ్రెస్ తరువాత, పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పేస్ బుక్..

పేస్ బుక్ పోస్ట్ వివాదంలో కాంగ్రెస్ తరువాత, పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు లేఖ రాసింది. బిజెపికి, ఫేస్‌బుక్‌కు మధ్య సంబంధం ఉందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉన్నాయని, ఫేస్‌బుక్ కంపెనీ బెంగాల్‌లో కొన్ని పేజీలు, ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించిందని పార్టీ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ లేఖ రాశారు.

ఇందుకు సంబంధించి బహిరంగ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో పేస్ బుక్ కంపెనీ అంతర్గత మెమోలు కూడా ఉన్నాయని. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ సమస్యలను లేవనెత్తినట్టు కూడా చెప్పారు. భారతదేశంలో ఫేస్‌బుక్ నిర్వహణపై ఈ తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తులో పారదర్శకత ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. పేస్ బుక్ ద్వారా కొన్ని విషయాలు లీక్ అవుతున్నాయని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories