బస్సును వెంటాడిన టైగర్.. తృటిలో తప్పించుకున్న పర్యాటకులు

బస్సును వెంటాడిన టైగర్.. తృటిలో తప్పించుకున్న పర్యాటకులు
x
Highlights

ఛత్తీస్‌గడ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని నందన్వన్ సఫారి జంగిల్ వద్ద ఒక పులి పర్యాటక బస్సును వెంబడించింది.. కొద్ది క్షణాలు ఆలస్యం అయితే ఆ పులి బస్సులో ఉన్న...

ఛత్తీస్‌గడ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని నందన్వన్ సఫారి జంగిల్ వద్ద ఒక పులి పర్యాటక బస్సును వెంబడించింది.. కొద్ది క్షణాలు ఆలస్యం అయితే ఆ పులి బస్సులో ఉన్న ప్రయాణికులపై దాడి చేసేది.. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. భద్రతలో నిర్లక్ష్యం వహించి.. ప్రోటోకాల్‌ను విస్మరించినందుకు పార్కుకు చెందిన ఇద్దరు ఉద్యోగులను తొలగించారు ఉన్నతాధికారులు. అనంతరం విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే

రాయ్‌పూర్‌లోని నందన్వన్ అడవిలో పర్యాటకుల ప్రాంతం కూడా ఉంది, ఇక్కడ అత్యంత జాగ్రత్తగా పర్యాటకులు ఉండాలి.. అయితే రెండు పులులు పోరాడుతుండగా.. పర్యాటకులు బస్సులోనుంచి చూస్తున్నారు.. ఈ క్రమంలో అకస్మాత్తుగా వారిలో ఒకరు తమ బస్సు కిటికీలోనుంచి ఒక పరదాను విరిసిరారు. దాన్ని ఒక పులి పుట్టుకొని వెంబడించింది.

అయితే పులి బస్సుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుందని పర్యాటకుడు గుర్తించి వెంటనే డ్రైవర్ను వేగం పెంచమని కోరాడు, అయినా అది వెంటాడుతోంది.. అయితే కాసేపటికి అది విడిచిపెట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన యొక్క వీడియో సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో.. బస్సు డ్రైవర్ మరియు టూర్ గైడ్ను తొలగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు.

"వాహనం డ్రైవర్ ఓంప్రాకాష్ భారతి మరియు గైడ్ నవీన్ పురైనా సేవలను రద్దు చేశారు. వారు సఫారి యొక్క ప్రామాణిక ప్రోటోకాల్‌ను విస్మరించారు" అని నందన్వన్ జంగిల్ సఫారి డైరెక్టర్ ఎం మెర్సీ బెల్లా చెప్పారు. "మా ప్రాథమిక విచారణ ప్రకారం, వీడియోను గైడ్ చిత్రీకరించారు. సఫారీ వద్ద జంతువులు మరియు సందర్శకుల భద్రతను నిర్ధారించడానికి గైడ్లు మరియు డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు, కాని ఈ ఇద్దరు సిబ్బంది ప్రోటోకాల్‌ను విస్మరించారు. వాహనాన్ని వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం చేశారు.. అని మరో అధికారి వెల్లడించారు. పర్యాటక వాహనానికి ఇన్‌చార్జి ఫారెస్ట్ గార్డుకు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు సఫారి డైరెక్టర్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories