పులి నోటి చిక్కి బతికిచచ్చాడు..!

పులి నోటి చిక్కి బతికిచచ్చాడు..!
x
పులి నోటి చిక్కి బతికిచచ్చాడు
Highlights

పులి నోటికి చిక్కి చాకచక్యంతో ప్రాణాలు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో నెటింట్లో వైరల్ అవుతుంది.

ఓ అడవిలో తేనే కోసం ఓ నాలుగురు స్నేహితులు వేళ్లడం.. అక్కడ వారికి ఓ ఎలుగుబంటి తారసపడడం.. అది వారి వద్దకు రావడం చూసి ముగ్గురు స్నేహితుల స్నేహిలని ఓ ఎలుగు బంటి తరమడం.. దాంతో ముగ్గరు తలా ఓ దక్కు వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడం. ఒకడు కిందపడిపోయి చనిపోయినట్లు నటిస్తే ఎలుగు బంటి పారిపోవడం విన్నకథే.

మహారాష్ట్రలోని బంధార జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఊర్లోకి చొరబడ్డ ఓ పులిని గ్రామస్తులంతా వెంటబడి తరుముతున్నారు. పులి భయంతో పరుగులు పెడుతూ సమీపంలోని పంట పొలాల్లోకి చేరింది. పులి కాస్త దూరం పరుగులు పెట్టి వెనక్కి వచ్చి దాడికి యత్నించింది. అందరూ దాని బారి నుంచి తప్పించుకోగా ఒక వ్యక్తి మాత్రం దాని చిక్కాడు. ఇకేం ఉంది అందరూ అతని పని అయితపోయిందని అనుకునారు. కానీ, ఆ పులి అతన్ని ఏమి చేయకుండా పారిపోయింది. దీంతో ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పులి నోటి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో దక్కించుకున్నాడు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories