పిడుగుపడే సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు ఇలా..

పిడుగుపడే సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు ఇలా..
x
Highlights

వర్షం పడే సమయంలో పిడుగులు పడి చాలా మంది మరణిస్తుంటారు. వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు....

వర్షం పడే సమయంలో పిడుగులు పడి చాలా మంది మరణిస్తుంటారు. వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. అయితే పిడుగు పడే సమాచారాన్ని ముందుగానే గ్రహించే యాప్ మనకు అందుబాటులోకి వచ్చింది. వజ్రపాత్‌ అనే యాప్ ను ఇందుకోసం తయారుచేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 'వీఏజేఆర్‌ఏపీఏఏటీ ' అని టైప్‌ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆ తరువాత యూజర్ లాగిన్ చెయ్యాలి . జియో ట్యాగింగ్‌ కోసం మొబైల్‌ఫోన్‌ నంబర్‌ను ఎంటర్ చెయ్యాలి. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. యాప్ లోని మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. అంతేకాదు పిడుగు ఎంత దూరంలో పడుతుందో కూడా చూపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories