విషాదం: మంటల్లో సజీవదహనం అయిన ముగ్గురు విద్యార్థినులు

విషాదం: మంటల్లో సజీవదహనం అయిన ముగ్గురు విద్యార్థినులు
x
Highlights

చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. సెక్టార్ 32 దగ్గర ఉన్న పీజీ వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. సెక్టార్ 32 దగ్గర ఉన్న పీజీ వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేర్ టేకర్ మరియు ఆమె సోదరితో పాటు డజను మంది బాలికలు మంటలనుంచి తప్పించుకోగలిగారు. మరో ఇద్దరు విద్యార్థినిలు భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ల్యాప్‌టాప్ బ్యాటరీ లేదా ఛార్జర్ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు.

ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ, అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెపుతున్నారు. మృతులను ముస్కాన్ మెహతా, రియా దత్తా మరియు పక్షి గ్రోవర్లుగా గుర్తించారు, వీరంతా 19 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. భవనంలో మంటలు చెలరేగడంతో.. సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లకు సమాచారం అందించారు.. ఇంతలో, కేర్ టేకర్ బబ్బూ మరియు ఆమె సోదరి మన్ప్రీత్ అలారం మోగించారు..

దాంతో లోపల నిద్రిస్తున్న 12 మంది బాలికలు గదుల్లో నుంచి బయటకు పరుగెత్తారు. ఈ హడావుడిలో కొందరు బాల్కానీనుంచి దూకారు. కొందరు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు మంటలు దాదాపు మొత్తం భవనానికి వ్యాపించాయి.. అని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.. ఈ భవనంలో సరైన వెంటిలేషన్, అగ్ని-భద్రతా చర్యలు లేవని ఆయన తెలిపారు.

మరోవైపు సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు ప్రకటించారు. భవనంపై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్‌ గెస్ట్‌లుగా వుంటున్నారని చండీగఢ్‌ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ముస్కాన్ మెహతా 21, హర్యానాలోని హిసార్ కు చెందినవారు కాగా.. రియా, 20, పంజాబ్లోని కపుర్తాలాకు చెందినవారు.. అలాగే 19 ఏళ్ల పక్షి అదే కళాశాలలో బీఏ -1 విద్యార్థి, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని కోట్కాపురకు చెందినవారు. వీరు సెక్టార్ 36 లోని అలయన్స్ ఫ్రాంకైస్ వద్ద ఫ్రెంచ్ తరగతులకు హాజరయ్యారు. పక్షి మరియు రియా ఊపిరి ఆడక మరణించారు.. ముస్కాన్ 70% కాలిన గాయాలకు గురయ్యారు. దాంతో ఆమె మృతి చెందారు.

గాయపడిన ఇద్దరు విద్యార్థులను హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన ఫెమినా (23), పంజాబ్‌లోని మోగాకు చెందిన జాస్మిన్ (19) గా గుర్తించారు. మంటల నుండి తప్పించుకోవడానికి వీరిద్దరూ బాల్కనీ నుంచి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories