రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి

రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి
x
Highlights

మధ్యప్రదేశ్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దాంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన సింగ్రౌలి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

మధ్యప్రదేశ్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దాంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన సింగ్రౌలి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. టాప్ విద్యుత్ జనరేటర్ ఎన్‌టిపిసికి చెందిన రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో లోకో పైలట్, అతని సహాయకుడితో సహా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగ్రౌలి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం వైధన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన ఎన్టీపీసీ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి లోకో పైలట్ రషీద్ అహ్మద్, యుపికి చెందిన అసిస్టెంట్ లోకో పైలట్ మండీప్ కుమార్, సింగ్రౌలీకి చెందిన పాయింట్స్ మ్యాన్ రామ్‌లక్షన్ మృతి చెందరారని తెలిపారు. ఆ ముగ్గురు రెండు ట్రైన్ల మధ్య చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యారని తెలిపారు.. బొగ్గును లోడ్ చేసుకొని రైళ్లలో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రిహంద్ నగర్‌లోని ఎన్‌టిపిసికి వెళుతుండగా, మరొకటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బొగ్గు దించుతూ తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వైధాన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ పాండే మాట్లాడుతూ, ఒక రైలు ట్రాక్‌ను మార్చేటప్పుడు మరొక రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే దీనిపై భారత రైల్వే వ్యవస్థకు సంబంధం లేదని ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఇసిఆర్) ప్రతినిధి రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రిహండ్‌లోని ఎన్‌టిపిసి యాజమాన్యంలోని, నిర్వహణలో ఉన్న మెర్రీ గో రౌండ్ (ఎంజిఆర్) వ్యవస్థలో ఇది జరిగిందని చెప్పారు. వారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రమాదంపై ఉదయాన్నే సమాచారం అందుకున్న ఎన్‌టిపిసి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందో ఇంజనీర్లు, పోలీసుల ద్వారా తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories