మ‌‌ద్యం తాగ‌డంలో ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలే టాప్‌...

మ‌‌ద్యం తాగ‌డంలో ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలే టాప్‌...
x
Highlights

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది. దీనితో ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో మద్యం షాపులు గత సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ధరలు పెంచినప్పటికి మందుబాబులు మాత్రం దుకాణాలు వద్ద భారీ క్యూలు కడుతున్నారు. ఎండలను సైతం లెక్క చేయడం లేదు. పలు చోట్లల్లో సామజీక దూరం సైతం పాటించడం లేదు.

క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేష‌న్ స‌ర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు తేలింది. అయితే ఇందులో అత్యధికంగా మ‌ద్యం వినియోగించే రాష్ట్రంగా త‌మిళ‌నాడు మొద‌టి స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్పత్తి అయ్య మొత్తం మ‌ద్యంలో 15 శాతం త‌మిళ‌నాడు ఉపయోగిస్తోంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక 12 శాతం, తెలంగాణ రాష్ట్రం 6శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం, కేర‌ళ రాష్ట్రం 5 శాతం వినియోగిస్తున్నాయి.

ఇక రాబడి శాతం పరంగా చూస్తే 15 శాతం చొప్పున తమిళనాడు, కేరళ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎందుకంటే కేరళ ప్రభుత్వం మద్యంపై అత్యధిక ప‌న్ను వ‌సూలు చేస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు 11 శాతం, తెలంగాణకు 10 శాతం అని నివేదిక చూపిస్తుంది. ఇక ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

ఇక కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి మొత్తం కేసులలో మహారాష్ట్ర మాత్రమే 31.2 శాతం ఉండగా, ఆ తరువాత ఢిల్లీ (10 శాతం), తమిళనాడు (7.6 శాతం), మధ్యప్రదేశ్ (7 శాతం), ఉత్తర ప్రదేశ్ (5.9 శాతం) ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories