ట్రంప్ 'టై' కథ.. రంగు వెనుక మర్మం ఇదే

ట్రంప్ టై కథ.. రంగు వెనుక మర్మం ఇదే
x
ట్రంప్ టై
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు పర్యటన కొనసాగతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిన స్టైలే సెపరేటు. నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు ఎప్పుడు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు పర్యటన కొనసాగతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిన స్టైలే సెపరేటు. నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు ఎప్పుడు వెనుకాడడు. అమెరికాకు అధ్యక్షుడు కాకముందే ట్రంప్ రెజ్లింగ్, టీవీషోస్, టీవీ సీరియల్స్, మూవీస్, యాడ్స్ పై మక్కువ చూపించేవారు.

అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుని హోదాలో తొలిసారి భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో తన డ్రెస్ తాను కట్టుకున్న నెక్ టైతోనే ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. ఆ‍యన డ్రసింగ్ స్టైల్ అధ్యయనం చేసిన వాళ్ళు ముందే చెబుతారు. అందుకే ట్రంప్ టైపై సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా వస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా బ్లూ లేదా బ్లాక్ సూట్‌లో ఎరుపు రంగు నెక్ టై కట్టుకునే కనిపిస్తారు. కానీ, భారత్ పర్యటనలో భాగంగా ఆయన తొలిసారి అహ్మదాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టినపుడు బ్లు కలర్ బ్లేజర్, ట్రౌజర్ ధరించి ఉన్నారు. లోపల వైట్ షర్ట్ తొడుక్కుని, ఎల్లో కలర్ నెక్ టై కట్టుకుని విభిన్న లుక్‌లో కనిపించారు.

ట్రంప్ ఎల్లో కలర్ నెక్ టైపై ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే అమెరికన్ సంప్రదాయం ప్రకారం రెడ్ నెక్ టై ఉంటే అత్యంత పవర్ ఫుల్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం అంట. అందుకే తన ఆధిపత్యం చాటుకునేందుకు ట్రంప్ ఎక్కువగా రెడ్ కలర్ టై కట్టుకొని పర్యటన చేస్తారు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా భారత్ పర్యటనకు వచ్చి ఈ సారి ఎల్లో కలర్ నెక్ టైతో దర్శనమిచ్చారు. నిజమైన ఆత్మీయులను కలుసుకునేపుడు, శాంతి సందేశాన్ని పంపితే, అమెరికన్ల ఎల్లో కలర్ నెక్ టై కట్టుకుంటారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అనేక పర్యటనలు చేశారు. పలు దేశాల అధినేతలను కలిశారు. అదే సమయంలో తన టై ద్వారా వారికి మెసేజ్ ఇస్తారు. ట్రంప్‌కు తన అభిమతాన్ని చాటడం కూడా అలవాటు. అమెరికన్ అభిప్రాయం ప్రకారం చూస్తే ట్రంప్ భారత్‌ను తన శ్రేయోభిలాషిగా చూస్తున్నారు. తాను ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలంటే అక్కడ నివాసం ఉండే భారతీయుల ఓట్లు కీలకం. భారత గడ్డమీద అడుగుపెట్టాడని భారతీయులు ఉగ్రవాదంతోపోరాడే శాంతికాములు అనే సందేశం ఇచ్చేందుకు.., ట్రంప్ పసుపు రంగు స్నేహం చిగురించాలన్న దానికీ సంకేతంగా టైని కట్టుకున్నారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories