Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్

The Second Phase of Polling is Tomorrow in Chhattisgarh
x

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్

Highlights

Chhattisgarh: పోలింగ్‍కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Chhattisgarh: 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకులు, ప్రధాన ఎన్నికల అధికారి రెండవ దశ ఓటింగ్‌కు ముందు రాయ్‌ఘర్ మహాసముంద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించి ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు.

ప్రత్యేక జనరల్ అబ్జర్వర్‌ ధర్మేంద్ర ఎస్. గంగ్వార్, ప్రత్యేక పోలీసు పరిశీలకుడు నీల్ కుమార్ శర్మతో పాటు ప్రత్యేక వ్యయ పరిశీలకుడు రాజేష్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories