Odisha: తాళికడతాడు అనగా పోలీసులు ఎంట్రీ..వరుడు అరెస్ట్.. విషయం తెలిసి షాక్ తిన్న వధువు బంధువులు

The Police Arrested Groom From Marriage in Odisha
x

Odisha: తాళికడతాడు అనగా పోలీసులు ఎంట్రీ..వరుడు అరెస్ట్.. విషయం తెలిసి షాక్ తిన్న వధువు బంధువులు

Highlights

Odisha: తాళికడతాడు అనగా పోలీసులు ఎంట్రీ..వరుడు అరెస్ట్.. విషయం తెలిసి షాక్ తిన్న వధువు బంధువులు

Odisha: పెళ్లి అంటే ఓ మధురమైన జ్ఞాపకం. ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే కాదు సరదాల సమ్మేళనం కూడా. కట్నాలు, కానుకలు, విందులు వినోదాలు ఇలా కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఒరిస్సా రాష్ట్రం ఢెంకానాల్ కు చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి సైతం తన పెళ్లిని ఇలాగే ధూమ్ ధామ్ గా జరుపుకునేందుకు రెడీ అయ్యాడు. తన ఇంటి నుంచి పెళ్లి మండపానికి బంధువులు, స్నేహితులతో కలిసి అంగరంగ వైభవంగా తరలివెళ్లాడు. దారి పొడుగునా తీన్ మార్ నృత్యాలతో అదరగొడుతూ వివాహ మండపానికి చేరుకున్నాడు. కొత్త పెళ్లికొడుకుకి వధువు తరపువారు కాళ్లు కడిగి వివాహమండపంలోని సగర్వంగా తీసుకెళ్లారు. కాబోయే బావగారిని భుజాలమీద ఎక్కించుకొని మరీ బామర్దులు ఫంక్షన్ హాల్ లోకి తోడ్కొని వెళ్లారు.

వివాహ ముహూర్తానికి ఇంకాస్త సమయం ఉండడంతో వరుడు తనకు ఇచ్చిన గదిలో కాస్త సేద తీరాడు. మరోవైపు పెళ్లి మండపం వద్ద వధూవరుల బంధువులు రాకతో కోలాహలంగా ఉంది. ఓవైపు సన్నాయి మేళాలు, మరోవైపు డీజే మోతతో హోరెత్తించేస్తున్నారు. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి కొడుకు సాంప్రదాయం ప్రకారం మండపంలోకి చేరుకున్నాడు. ఇంకాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చొని వధువు మెడలో తాళి కట్టడమే తరువాయి.

పెళ్లి కొడుకుతో సహా అందరూ ఈ క్షణం కోసం ఎదురుచూస్తుండగా ఎవరూ ఊహించని విధంగా పెళ్లి మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేలోపే వరుడుని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు. ఒడిశాలో సంచలనంగా మారిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...వరుడు అజిత్ కుమార్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పని చేస్తున్నాడు. అతడికి ఓ యువతితో వివాహం కుదిరింది. అయితే ఈ ప్రబుద్ధుడు భువనేశ్వర్ కు చెందని మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు.

అజిత్ కుమార్ ఇచ్చిన మాట తప్పి ఇంకో యువతి మెడలో తాళి కట్టేందుకు సిద్ధపడ్డాడని తెలియడంతో అతడిపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు రంగంలోకి దిగి అజిత్ కుమార్ ను అరెస్ట్ చేశారు. విషయం తెలియడంతో వధువు బంధువులు అవాక్కయ్యారు. తాళి కట్టడానికి కొన్ని నిమిషాల ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అజిత్ ను అరెస్ట్ చేయడంతో తమ అమ్మాయి జీవితం నాశనం కాలేదని ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని వంచించి మరొకరి గొంతు కోసేందుకు సిద్ధపడ్డ అజిత్ కుమార్ కు శాపనార్థాలు పెడుతూ కట్న కానుకలుగా అతడికి పెట్టిన వస్తువులను తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories