టెన్షన్ పెడుతున్న కొత్త వేరియంట్ నియోకోవ్

The new variant of the tension is Neocov
x

టెన్షన్ పెడుతున్న కొత్త వేరియంట్ నియోకోవ్

Highlights

Neocov: మనుషుల్లో వ్యాప్తి మొదలైతే ముప్పు తప్పదని వార్నింగ్...మరణాలు భారీ ఉంటాయంటున్న వుహాన్ సైంటిస్టులు.

Neocov: ప్రపంచ దేశాల్లో కోవిడ్ కల్లోలం కొనసాగుతున్న వేళ.. కొత్త వేరియంట్లు మరింత కంగారెత్తిస్తున్నాయి. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో మరో డేంజర్ వేరియంట్ నియోకోవ్ వెలుగు చూడడం ఆందోళన రేపుతోంది. నియోకోవ్ జంతువులను దాటి మనుషులకు వ్యాపించడం మొదలైతే అత్యంత వేగంగా విజృంభించే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. నియోకోవ్ వైరస్‌తో మరణాల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుందని వుహానక్ సైంటిస్టులు ఇప్పటికే బాంబ్ పేల్చారు. వుహాన్ శాస్త్రవేత్తల హెచ్చరికలపై క్లినికల్ ఎథిక్స్ చైర్మన్ విజయ్ భాస్కర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్ గబ్బిలాల నుంచే వ్యాప్తి చెందుతుందని, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఏవీ నియోకోవ్ వైరస్‌ని ఎదుర్కోలేవన్నారు. ఇదే విషయం SETA చెబుతోందని విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫిబ్రవరిలో తారా స్థాయికి చేరుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు గబ్బిలాల నుంచి జంతువులకు వ్యాప్తి జరిగి మ్యుటేషన్స్ అవుతూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయన్నారు డాక్టర్ సాయి. నియోకోవ్ సైతం అలానే మనుషులకు సోకే ఛాన్స్ ఉందని, ఇదే కనుక జరిగితే మరణాల భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. చైనాలో వుహాన్ ల్యాబ్‌ సైంటిస్టులు నియోకోవ్‌‌ను డేంజర్ వేరియంట్‌‌గా చెబుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మరింత అధ్యయనం అవసరం అని అభిప్రాయ పడుతోంది. ఇక.. రానున్న రోజుల్లో కొత్త మహమ్మారి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories