Passport: మీకు పాస్‌పోర్ట్‌ ఉందా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి..?

The Government of India has made changes in the passport Is this true
x

Passport: మీకు పాస్‌పోర్ట్‌ ఉందా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి..?

Highlights

Passport: మీకు పాస్‌పోర్ట్‌ ఉందా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి..?

Passport: మీకు పాస్‌పోర్టు ఉందా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ అవసరం, దీనిని తయారు చేయడం సుధీర్ఘ ప్రక్రియ. అయితే ఇటీవల పాస్‌పోర్ట్‌లో భారత ప్రభుత్వం మార్పులు చేసిందని ఒక వార్త వైరల్‌ అవుతోంది. నిజానికి పాస్‌పోర్ట్ పొందడానికి చాలా పెద్ద ప్రక్రియ. ఇందుకోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీ సమాచారాన్ని ధృవీకరించాలి.

పోలీసు వెరిఫికేషన్‌ జరగాలి. ఆ తర్వాత మాత్రమే పాస్‌పోర్ట్ లభిస్తుంది. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. కాగా పాస్‌పోర్ట్‌లో ప్రభుత్వం మార్పులు చేసిందని సోషల్ మీడియాలో ఒక మెస్సేజ్‌ వైరల్ అవుతోంది. ఇప్పుడు ప్రజలు తమ పాస్‌పోర్ట్‌లలో మార్పులు చేసుకోవాలని కూడా ఇందులో సూచించడం జరిగింది.

ఈ మెస్సేజ్‌లో నిజమెంత..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాన్ని పిఐబిలో ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దీని గురించి సమాచారం తెలియజేస్తూ భారత ప్రభుత్వం భారతీయ పాస్‌పోర్ట్ నుంచి జాతీయత కాలమ్‌ను తొలగించినట్లు వాట్సాప్ సందేశంలో క్లెయిమ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది పూర్తిగా బోగస్ అని నిర్దారించింది. పాస్‌పోర్ట్‌కు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories