ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేస్తున్న ఎన్నికల సంఘం

The Election Commission is preventing people from being tempted in elections
x

ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేస్తున్న ఎన్నికల సంఘం

Highlights

మార్చి 1 నుంచి నేటి వరకు 4,658 కోట్ల మేర స్వాధీనం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి ప్రతిరోజూ సగటున 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4 వేల 658 కోట్లుగా ఉంటుందని ప్రకటించింది. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని ఈసీ తెలిపింది. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్‌ చేయలేదని పేర్కొంది. సీజ్ అయిన వాటిలో నగదు 395 కోట్లు ఉండగా... 489 కోట్ల విలువైన మద్యం ఉన్నట్లు ఈసీ తెలిపింది. 2 వేల 69 కోట్ల విలువైన మాదకద్రవ్యాలే ఉన్నాయని పేర్కొంది.e

Show Full Article
Print Article
Next Story
More Stories