అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన రైతు సంఘాల ఆందోళన

The concern of internationally debated farmer associations
x

(ఫైల్ ఇమేజ్)

Highlights

* రైతు ఆందోళనలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న మద్దతు * ఆందోళనలపై స్పందిస్తోన్న విదేశీ ప్రముఖులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తోన్న రైతుల ఆందోళన అంతర్జాతీయంగా చర్చనీయమైంది. వివిధ దేశాలు, రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించటంతో ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీంతో ప్రపంచమంతా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది రైతు ఆందోళన.

రైతు ఆందోళనలపై ప్రముఖ పాప్ సింగ‌ర్ రిహానా ట్వీట్‌తో ప్రారంభమైన ట్వీట్ వార్‌ కొనసాగుతోంది. రిహానాతో పాటు యాక్టివిస్ట్ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హారిస్ మేన‌కోడ‌లు మీనా హారిస్ , మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, యూట్యూబర్‌ లిల్లీ సింగ్ లాంటి ప్రముఖులంతా రిహానా చేసిన ట్వీట్‌కు స్పందించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు.

ఓవైపు రైతుల నిరసనకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ట్వీట్లు వెల్లువెత్తుతుండగా మరోవైపు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. భారత్‌లో విభజన సృష్టించేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దంటూ అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్‌, ఏక్తా కపూర్ ట్వీట్స్ చేశారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్ కోహ్లి‌, రైనా, కుంబ్లే బ్యాడ్మింటన్‌ ప్లేయర్ సైనా నేహ్వాల్‌ కూడా ఇండియా టుగెదర్ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. దీంతో అంతర్జాతీయ సెలబ్రిటీలు, ఇండియన్ సెలబ్రిటీల మధ్య ట్వీట్ వార్‌ సాగుతోంది.

మరోవైపు బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల ఇండియా టుగెదర్‌ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తం బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రికెటర్లు చేసిన ట్వీట్స్‌ అన్ని దాదాపు ఒకేలా ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని ఎవరు కాపీ కొట్టారో అర్థం కావడం లేదని కామెంట్ చేస్తూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సెలబ్రిటీలంతా ఒకే రకంగా ట్వీట్లు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. ఇవన్ని పేయిడ్‌ ట్వీట్లు లేదా ఎవరి బలవంతంతో అయినా ట్వీట్‌ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఈ సెలబ్రిటీల ట్వీట్ వార్‌ ఇప్పుడు నెట్‌లో వైరల్ అయిపోయింది. రిహానాతో సహా రైతులకు మద్దతు తెలిపిన సెలబ్రిటీలకు రీట్వీట్‌లు వెల్లువెత్తుతున్నాయి. మిలియన్ల కొద్దీ ట్వీట్లతో స్టాండ్ విత్ ఫార్మర్స్, పార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్‌లు ట్విట్టర్‌ను ఊపేశాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories