Amit Shah: లోక్‌సభలో 3 కొత్త బిల్లులు.. కొత్త చట్టాల ద్వారా మహిళలకు మరింత రక్షణ

The Center Introduced Three New Bills
x

Amit Shah: లోక్‌సభలో 3 కొత్త బిల్లులు.. కొత్త చట్టాల ద్వారా మహిళలకు మరింత రక్షణ

Highlights

Amit Shah: నేరస్తుడు పట్టుబడిన తరువాత శిక్ష అమలు చేయవచ్చు

Amit Shah: భారత్‌లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఐపీసీ సీఆర్‌పీసీ ఎవిడెన్స్‌ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాఈ మేరకు మూడు బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023 , భారతీయ సాక్ష్య బిల్లు- 2023 తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. కొత్త మూడు చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయ ని లోక్‌సభలో అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ‘శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యంమని అమిత్ షా అన్నారు. అయితే.. నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయన్నారు.

ఈ చట్టాల ద్వారా పరారీలో ఉన్న నేరస్తుడిపై కూడా విచారణ జరిపి శిక్ష వేయవచ్చన్నారు. నేరస్తుడు పట్టుబడిన వెంటనే శిక్ష అమలు చేయవచ్చన్నారు. ఉదాహరణకు నేరాలు చేసి పాకిస్తాన్ పారిపోయిన మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంపై విచారణ జరిపి శిక్ష వేయవచ్చాన్నారు. ఈచట్టాల ద్వారా మహిళలకు మరింత న్యాయం జరుగుతుందని అమిత్ షా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories