నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

The Budget Meetings of the Parliament will Start Today
x

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Highlights

*ఉ.11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Parliament Budget Session: మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రెండు సభలనూ ఉద్దేశించి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు.. జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు. అందువల్ల రాష్ట్రపతి ప్రసంగం తర్వాత... దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఆర్థిక సర్వేను రెండు సభల్లో ప్రవేశ పెడతారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. సాధారణ బడ్జెట్‌ను ముందుగా లోక్‌సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశ పెడతారు.

ఈ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఇప్పటికే కేంద్రం.. ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రతిపక్షాలను కోరింది. ఈ సమావేశాలకు 27 పార్టీల తరపున 37 మంది సభ్యులు రాగా... కాంగ్రెస్ హాజరుకాలేదు. వ్యాపారవేత్త అదానీ అంశంపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, RJD కోరాయి. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని YCP కోరింది. చైనా ఆక్రమణలపై చర్చ జరగాలని BSP కోరింది. ఇప్పుడు అది కుదరదన్న కేంద్రం.. ఈసారి బడ్జెట్‌పై చర్చించడం కీలకం అని తెలిపింది. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు అనుమతిస్తామని తెలిపింది.

ఈసారి బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31న మొదలై... ఫిబ్రవరి 13 వరకూ ఉంటుంది. రెండో దశ మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఉంటుంది. మొత్తంగా 27 రోజులు ఈ సమావేశాలు ఉంటాయి. ఇవాళ రేపు జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండదు కాబట్టి ప్రతిపక్షాలు ఏం అడగాలన్నా.. ఫిబ్రవరి 2న జరిగే జీరో అవర్‌లో అడగాల్సి ఉంటుందని పార్లమెంటరీ బులిటెన్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories