పీఓకేలో టెన్షన్... టెర్రర్ లాంచ్ పాడ్‌లపై భారత ఆర్మీ దాడులు

పీఓకేలో టెన్షన్... టెర్రర్ లాంచ్ పాడ్‌లపై భారత ఆర్మీ దాడులు
x
Highlights

పీఓకేలోని పాకిస్థాన్ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్‌లపైనా భారత సైన్యం కాల్పులు జరిపింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ( పీఓకే) లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీఓకేలోని పాకిస్థాన్ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్‌లపైనా భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈకాల్పుల్లో సుమారు 10 మంది వరకు పాకిస్థాన్ సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయలో అక్టోబర్ 20న ఈ దాడులు జరిగాయని, భారత జవాన్ల కాల్పుల్లో దాదాపు నాలుగు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్టు బిపిన్ రావత్ రావత్ తెలిపారు. జమ్ము కశ్మీర్లోని తంగ్‌ధర్ సెక్టార్‌లో భారత సైన్యాన్నిటార్గెట్ చేస్తూ పాక్ సైనికులు కాల్పులకు దిగారని, ఆ దాడులను తిప్పికొట్టేందుకు పీఓకేలో భారత జవాన్లు ఆ దేశ మిలిటరీ శిబిరాలపై టార్గెట్ చేశారని రావత్ తెలిపారు.

అయితే తమ సైనిక స్థావరాలపై దాడి జరిగిందన్న వార్తలను ఆదేశ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఖండించారు. భారత్ కావాలనే తప్ప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిజంగా పాక్ స్థావరాలపై దాడులు జరిగాయో లేదో తెలుసుకోవాలంటే ‎దౌత్యాధికారులను ప్రాంతాలను రప్పించే ఏర్నాటు ఇండియా చేసుకోవచ్చని ఫైజల్ అన్నారు. సర్జికల్ దాడులతో పోల్చరాదని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories