భారత్‌, చైనా సరిహద్దుల్లో హైటెన్షన్

భారత్‌, చైనా సరిహద్దుల్లో హైటెన్షన్
x
Highlights

భారత్‌, చైనా భూభాగంలో మరోసారి ఉద్రిక్తత స‌రిస్థితులు చెలరేగాయి.

భారత్‌, చైనా భూభాగంలో మరోసారి ఉద్రిక్తత స‌రిస్థితులు చెలరేగాయి. ఇటీవల రెండు దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడిన సంగ‌తి తెలిసిందే. మే 5వ‌తేదీనా లద్దాక్ తూర్పు భాగం‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద సైనికులు బాహాబాహీకి దిగిన సంగ‌తి మ‌ర‌వ‌క ముందే మ‌రోసారి చైనా సైన్యం క‌వ్విపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది.

మే 12( మంగళవారం ) చైనాకు చెందిన సైనిక విమానాలు ఇండియా-సినో సరిహద్దు వద్ద నిషిద్ధ గ‌గ‌న‌తలం ఎగిరాయి. చైనాకు చెందిన మిలిటరీ విమానాలు భార‌త‌ గగనతలంలో చక్కర్లు కొట్టాయని అధికారులు తెలిపారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు పంపిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఇరు దేశాల స‌రిహ‌ద్దున ఉద్రిక్త‌త‌లు చెల‌రేగాయి

మే 5వ తేదీ రాత్రి లద్దాక్‌లోని పాంగాంగ్ రెండు దేశాల‌ బాహాబాహీకి దిగారు. సుమారు 250 మంది సైనికులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనలో చైనా, భార‌త్ చెందిన 10మంది సైనికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మే 6న ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనికాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగిందని వెల్లడించారు.

అయితే, శనివారం సిక్కిం సెక్టార్‌లోని 'నాకు లా పాస్‌' మరోసారి ఇరుదేశాల సైనికుల మ‌ధ్య‌ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ భారత్, చైనాకు చెందిన సుమారు 150 మంది సైనికులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. తాజాగా లద్ధాక్‌లో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ‌తంలో మొద‌టి సారి 2017 ఆగస్టులో లద్దాక్ సమీపంలో భార‌త్ చైనా సైన్యం మ‌ద్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. త‌ర‌చూ చైనా, భార‌త్ బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories