తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ తమిళ్ వర్చువల్ అకాడమీ సందర్శన

తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ తమిళ్ వర్చువల్ అకాడమీ సందర్శన
x
Highlights

ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర మంగళవారం తమిళ్ వర్చువల్ అకాడమీని సందర్శించారు.

చెన్నై: ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర మంగళవారం తమిళ్ వర్చువల్ అకాడమీని సందర్శించారు.ఈ సందర్బంగా వర్చువల్ అకాడమీ డైరెక్టర్ కోమగన్ శాలువా కప్పి విల్సన్ ని సన్మానించి, ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా వర్చువల్ అకాడమీ కార్యక్రమాలను గురించి చర్చించారు. డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ మోజి పవర్ ప్రజెంటేషన్ చేశారు.

ఈ సందర్బంగా వారు తమిళ్ భాషని రాష్ట్రంలో వ్యాప్తి ఎలా చేస్తున్నారో తెలియచేశారు. ఇందులో భాగం గా తమిళ్ చదవడం రాయడం నేర్పిస్తాం అని తెలియ చేశారు. ప్రపంచంలోని 40 దేశాల్లోని తమిళు లకు భాష నేర్పిస్తాం అన్నారు. ఆన్లైన్ పద్ధతి లో ఉచితంగా నేర్పిస్తాం అని తెలియ చేశారు. తమిళం నేర్చుకోదలిచినవారు తమ వెబ్ సైట్ WWW.tamil vu. Org లో రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పారు.

మైగ్రేటెడ్ లేబర్ కి, ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వారికి, కేంద్రియ విద్యాలయ విద్యార్థులకు తమిళ్ నేర్పిస్తాం అన్నారు. కాగా, ఇదే పద్ధతిలో తెలుగు భాష రాని వారికి నేర్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు విల్సన్ చెప్పారు. విల్సన్ తో పాటు పొట్టిశ్రీరాములు స్మారక భవనం అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి, టామ్స్ అధ్యక్షులు ఇజ్రాయిల్, మెర్కూరి సంస్థ అధినేత తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories