Delhi: తెలంగాణ, కేంద్రం మధ్య ముదురుతున్న వరి వార్‌

Telangana Minsiters Waiting for Union Ministers Appointment from Three Days
x

మూడు రోజులుగా ఢిల్లీలోనే తెలంగాణ మంత్రుల బృందం

Highlights

*మూడు రోజులుగా ఢిల్లీలోనే తెలంగాణ మంత్రుల బృందం *కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ కోసం పడిగాపులు

Delhi: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం మరోసారి రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. వానాకాలం సీజన్ పంట పూర్తిగా కొనుగోలుకు FCI కి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వరి కొనుగోలు అంశం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెంచుతోంది. కేంద్రం బాయిల్డ్ రైస్ మినహా మిగతా ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతోంది. సాధారణంగా యాసంగిలో ఎక్కువగా వచ్చే పంట బాయిల్డ్ రైస్ కావడంతో దానిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అనేక మార్లు కోరినప్పటికీ ప్రయోజనం లేదు. దీంతో యాసంగిలో బాయిల్డ్ రైస్ వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆహార ధాన్య సేకరణలో జాతీయ సముగ్ర విధానాన్ని ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ వానాకాలం సీజన్‌లో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. మరికొన్ని జిల్లాల్లో వరి కోతలు జరుగాల్సి ఉంది. ఇప్పటివరకు కేంద్రం 59 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగోలుకు FCI కి ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 50 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. మరో 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇది కూడా మరో వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సివిల్ సప్లై శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక.. మిగితా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలంటే.. కేంద్రం FCI కి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఫలితంగా ధాన్యం కల్లాల్లో, ఇంటి ముందు, రోడ్లపై ఎండకు ఎండుతూ, మంచుకు నానుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోలు విషయంలో చివరి ప్రయత్నంగా సీఎం కేసీఆర్‌... మంత్రులను ఢిల్లీకి పంపించారు. ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ కోసం తెలంగాణ మంత్రుల బృందం ఎదురుచూస్తోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని, వానాకాలం పంటతో పాటు వచ్చే యాసంగిలో ఎంత మేరకు ధాన్యం కొంటారో తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు మంత్రులు.

మరోవైపు తెలంగాణ రైతాంగం విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. సీఎం కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే కేంద్రం తగిన మూల్యం చెల్లించకుంటుందని హెచ్చరిస్తున్నారు. వానాకాలం పంటను పూర్తిస్థాయిలో కొంటామని చెప్పిన కేంద్రం.. తక్షణమే FCI కి ఆదేశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు నష్టపోకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories