TCS: ఉద్యోగులకు భారీ షాక్.. 12 వేల మందికి లేఆఫ్స్‌

TCS: ఉద్యోగులకు భారీ షాక్.. 12 వేల మందికి లేఆఫ్స్‌
x
Highlights

భారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో సుమారు 2 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది.

భారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో సుమారు 2 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. అంటే దాదాపు 12,000 మందికి పైగా ఉద్యోగాలు కోతకు గురికానున్నాయి.

మధ్య, సీనియర్ మేనేజ్మెంట్‌నే లక్ష్యం

ఈ లేఆఫ్స్‌ ప్రధానంగా మిడిల్‌ మరియు సీనియర్‌ మేనేజ్మెంట్‌ సిబ్బందిని ప్రభావితం చేస్తాయని కంపెనీ తెలిపింది. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడం, AI అమలు కోసం సిబ్బందిని రీ-స్కిల్ చేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

సేవలపై ప్రభావం ఉండదన్న హామీ

"మా కస్టమర్లకు అందించే సేవలపై ఎలాంటి ప్రభావం లేకుండా ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా అమలు చేస్తున్నాం" అని TCS స్పష్టం చేసింది.

కారణాలు ఏమిటి?

కస్టమర్ల నుంచి తగ్గిన డిమాండ్‌, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఈ లేఆఫ్స్‌కు కారణమని సమాచారం.

ఉద్యోగులకు భరోసా

లేఆఫ్‌ అయ్యే ఉద్యోగులకు సేవరెన్స్ పే, నోటీసు కాలానికి జీతం, ఇన్సూరెన్స్ కొనసాగింపు, ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసులు, మానసిక ఆరోగ్య సలహాలు అందించనున్నట్లు కంపెనీ హామీ ఇచ్చింది.

TCS సీఈఓ స్పందన

"ఈ నిర్ణయం మాకు కూడా కష్టతరమే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన అడుగు ఇది" అని సీఈఓ కే.కృతివాసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం TCS‌లో 6.13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories