Tamilisai: అమిత్ షా క్లాసు తీసుకుంటున్న వీడియోపై క్లారిటీ


Tamilisai: అమిత్ షా క్లాసు తీసుకుంటున్న వీడియోపై క్లారిటీ
Tamilisai Soundararajan: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సమయంలో ఆ స్టేజ్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి క్లాసు తీసుకుంటున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది.
Tamilisai Soundararajan: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సమయంలో ఆ స్టేజ్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి క్లాసు తీసుకుంటున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోపై వదంతులు వ్యాపించడంతో తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తన ఎక్స్ అకౌంట్‌లో ఆమె వివరాలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమిత్ షాను కలిశానని ఎన్నికల తర్వాత చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించుకున్నట్లు ఆమె తెలిపారు.
Yesterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 13, 2024
adviced to carry out the…
ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృత స్థాయిలో రాజకీయ, సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని షా సూచించినట్లు ఆమె చెప్పారు. వీడియో ఆధారంగా అనవసర ఆరోపణలు వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీలో అంతర్గత కుమ్ములాట జరుగుతోందన్న ఊహాగానాలను తెరదించేందుకు తమిళిసై పోస్టు పెట్టారు. మరోవైపు అన్నామలై సైతం ఈ వివాదానికి శుభంకార్డు పలికారు. స్వయంగా తమిళిసై ఇంటికి వెళ్లి ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని రాసుకొచ్చారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేసింద్నారు అన్నామలై.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



