తమిళనాడులో భారీ వర్షాలు.. ఇవాళ విద్యా సంస్థలకు సెలవు

Tamil Nadu schools Declared Holiday Today due to Heavy Rains
x

తమిళనాడులో భారీ వర్షాలు.. ఇవాళ విద్యా సంస్థలకు సెలవు

Highlights

Tamil Nadu: వరదలోనే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు

Tamil Nadu: మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్‌, తిరువళ్లూరు జిల్లాల్లో తీవ్రనష్టం సంభవించింది. చెన్నై శివార్లు ఇంకా వరద ముంపు ఎదుర్కొ్ంటూనే ఉన్నాయి. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేయలేకపోయారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున, చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు నేడు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో చెన్నైలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి 9వేల మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories