తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్సకు ఫిక్సిడ్ రేట్లు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్సకు ఫిక్సిడ్ రేట్లు
x
File Photo
Highlights

ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైద్యానికి వేసే బిల్లులపై గరిష్ట పరిమితిని విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైద్యానికి వేసే బిల్లులపై గరిష్ట పరిమితిని విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులను రెండు కేటగిరీలుగా విభజన చేసింది. మొదటి కేటగిరిలో గ్రేడ్ లో ఏ 1, ఏ2 ఆస్పత్రులు.. రెండవ కేటగిరిలో గ్రేడ్ ఏ3 , ఏ 4 ఆసుపత్రులుగా నిర్ణయించింది. ఇక సాధారణ బెడ్ కి A1,A2 ఆసుపత్రిల్లో రోజుకి 7, 500 రూపాయలను a3, a4 ఆస్పత్రిల్లో రోజుకి 5వేల రూపాయల గరిష్ట పరిమితి మించరాదంటూ ప్రకటించింది.

ఐసియు బెడ్ కి ఆస్పత్రిలో రోజుకి 15 వేలకు మించి బిల్లు వేయరాదు అంటూ నిర్దేశించిన తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైద్యానికి విపరీతంగా బిల్లు వేస్తున్నారు అంటూ పేషెంట్లు నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తమిళనాడు శాఖ) కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లో covid-19 వైద్యానికి వేసే బిల్లుకు పరిమితి విధించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం రోగులకు భారీ బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories