కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కుష్బూ.. నేడు బీజేపీలోకి?

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కుష్బూ.. నేడు బీజేపీలోకి?
x
Highlights

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాదిలో ప్రముఖ నటి అయిన ఖుష్బు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె 2014 నుండి ఆరు సంవత్సరాలుగా..

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాదిలో ప్రముఖ నటి అయిన ఖుష్బు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె 2014 నుండి ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ తో ఉన్నారు. నిన్నటివరకూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే 2014 నుండి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో, ఆమె రాజకీయ భవిశ్యత్ ప్రశ్నార్ధకంలో పడింది. కాంగ్రెస్ బలం అంతమాత్రమే అయిన తమిళనాడులో ఖుష్భు నిర్ణయం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీ పొత్తు నేపథ్యంలో లోక్ సభ టిక్కెట్ ఆశించిన ఖుష్భుకు నిరాశే ఎదురైంది.. పొత్తులో భాగంగా ఆమెకు ఇస్తారన్న టిక్కెట్ ను డీఎంకే ఎగరేసుకుపోయింది. అయితే రాజ్యసభకు పంపిస్తామని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు ఆమెకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

కానీ ఆ ముచ్చటా తీరలేదు.. ఈ క్రమంలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని ‌ఖుష్బూ సమర్థించారు. దీంతో ఖుష్బూ తీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌ అయింది.. ఇక ఆదివారం కాంగ్రెస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కుష్భు ప్రకటించారు.. ఇదిలావుంటే 2021 రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కుష్బూ ఈ రోజు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించలేదు. ఒకవేళ కుష్బూ గనక బీజేపీలో చేరినట్టయితే తమిళనాడులో ఆ పార్టీకి కొత్త గ్లామర్ వచ్చినట్టే అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories