M K Stalin: అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు సీఎం స్టాలిన్

Tamil Nadu CM Stalin Made a Surprise Visit to the Adhiyamankottai Police Station Last Night 29 09 2021
x

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు సీఎం స్టాలిన్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* తనదైన స్టైల్‌లో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న సీఎం స్టాలిన్ * పర్యటన మార్గమధ్యంలో పోలీస్‌స్టేషన్ ను తనిఖీ చేసిన సీఎం

M K Stalin: తనదైన స్టైల్ లో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరోసారి తన మార్కును చూపించారు. ఓ పర్యటనకు వెళ్ళిన సీఎం స్టాలిన్ మార్గమధ్యలో ఓ‌ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

ధర్మపురికి వెళ్తున్న స్టాలిన్ నిన్న రాత్రి అడియన్ ఫోర్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తన పర్యటనను ముగించుకుని ధర్మపురికి బయలుదేరారు సీఎం స్టాలిన్. మధ్యలో అడియమన్ కొత్తై పోలీస్ స్టేషన్‌లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు.

పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి, ఎస్‌ఐ సీటులో కూర్చుని తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో వచ్చిన ఫిర్యాదులు తీసుకున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల తర్వాత సీఎం స్టాలిన్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories