పరారీలో 'ఆప్' కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్.. అక్కడ సిగ్నల్ ట్రేస్..!

పరారీలో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్.. అక్కడ సిగ్నల్ ట్రేస్..!
x
Highlights

ఈశాన్య ఢిల్లీలోని చంద్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) సిబ్బంది అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)...

ఈశాన్య ఢిల్లీలోని చంద్ బాగ్ లో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) సిబ్బంది అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ మహ్మద్ తాహిర్ హుస్సేన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

అంకిత్ శర్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉన్నాడని , అతని సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్ చివరిగా ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ట్రేస్ అయిందని ఈ కేసును విచారిస్తున్న, పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారని జాతీయ మీడియా రాసింది.

దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు అయిన వెంటనే అతను పారిపోయి ఉండవచ్చని ఈ అధికారి తెలిపారు. దీంతో ఉత్తర ప్రదేశ్ మరియు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల వద్ద స్పెషల్ టీం పోలీసుల, యాంటీ టెర్రర్ స్క్వాడ్ సహా ఐదు పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.

"హుస్సేన్ బంధువులు, స్నేహితులు మరియు పొరుగువారిని అతని ఆచూకీ గురించి ఆధారాలు సేకరించేందుకు మేము ప్రశ్నిస్తున్నాము. సాయంత్రం (శుక్రవారం) వరకు అనేక దాడులు జరిగాయి, కాని అతన్ని కనుగొనలేకపోయాము' అని కేసును పరిశీలిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించారు.

అయితే తాను ఈ హత్యకు పాల్పడలేదని హుస్సేన్ ఖండించారు.. అంతేకాకుండా పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు తాను బంధువుల నివాసంలో ఉన్నానని గురువారం తెలిపారు.

శుక్రవారం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కి చెందిన తొమ్మిది మంది సభ్యుల బృందం చంద్ బాగ్ లోని హుస్సేన్ ఇంటిని పరిశీలించి, దర్యాప్తుకు సహాయపడే ఆధారాలను సేకరించింది. ఒక సీనియర్ ఎఫ్ఎస్ఎల్ అధికారి మాట్లాడుతూ, 'పెట్రోల్ బాంబులు (మోలోటోవ్ కాక్టెయిల్), ఖాళీ సీసాలు, రాళ్ళు మరియు ఇటుకలు టెర్రస్ మీద మరియు హుస్సేన్ ఇంటి లోపల దొరికాయి.' అని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories