Tahawwur Rana: మహాకుంభమేళలో అల్లర్లకు భారీ కుట్రం.. బయటపడిన బండారం!

Tahawwur Rana
x

Tahawwur Rana: మహాకుంభమేళలో అల్లర్లకు భారీ కుట్రం.. బయటపడిన బండారం!

Highlights

Tahawwur Rana: తహావుర్ రాణా టార్గెట్ చేసిన ప్రాంతాల్లో మతపరమైన మహోత్సవాలు, రిటైర్డ్ ఆర్మీ, నేవీ అధికారుల వసతిగృహాలున్న జల వాయు విహార్ వంటి చోట్లపై దృష్టి పెట్టాడు.

Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలకపాత్ర పోషించిన తహావుర్ రానా లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలు కేవలం ముంబైతో పరిమితంగా లేకుండా, దేశవ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాలు, మతపరమైన ఉత్సవాలవైపు కూడా విస్తరించాయి. అతడి అజెండాలో హరిద్వార్‌లో జరిగే కుంభమేళా, రాజస్థాన్‌లోని పుష్కర్ మేళా వంటి భారీ జన సమాగమాలపై దాడులు కూడా ఉన్నట్టు సమాచారం బయటపడింది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మాజీ ఐజీగా పనిచేసిన లోకనాథ్ బెహెరా వెల్లడించిన వివరాల ప్రకారం, రానా కేవలం ఉత్తర భారతదేశం మీదే కాదు, దక్షిణ భారతదేశంలోని కొచ్చిలోనూ కార్యకలాపాలు సాగించాడు. అక్కడ నావల్ క‌మాండ్, షిప్‌యార్డ్ వంటి కీలక ప్రదేశాలపై పర్యవేక్షణ నిర్వహించి, అవసరమైన మనుషుల్ని కూడగట్టాడట.

మరోవైపు, సీనియర్ జర్నలిస్టు సందీప్ ఉన్నిథన్ వెల్లడించిన ఓ కీలక సమాచారం ప్రకారం, ముంబైలోని జల్ వాయు విహార్ అనే ఏర్‌ఫోర్స్‌, నేవీ రిటైర్డ్ ఆఫీసర్ల కాలనీ కూడా రానా టార్గెట్‌లో ఉండేది. పౌవాయిలోని హోటల్‌లో ఉండి ఆ ప్రాంతాన్ని రానా గమనించినట్టు డేవిడ్ హెడ్‌లీ విచారణలో చెప్పాడు. 1971 యుద్ధ వీరులకు చెందిన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రతీకార చర్యలు తీసుకోవాలన్నదే రానా ఉద్దేశమట.

ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తహావుర్ రానాextradite చేయడంతో అతన్ని ఢిల్లీకి తీసుకువచ్చేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో దేశానికి వచ్చిన రానా, ప్రస్తుతం NIA కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలో ప్రత్యేక విచారణ సెల్ ఏర్పాటు చేసి, అక్కడే దర్యాప్తు జరపనున్నారు. ముంబై దాడుల్లో అతని పాత్రపై కేసు నడపడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories