పెళ్లికి ముందు పెద్ద షాక్.. వధువు తల్లితో పారిపోయిన వరుడి తండ్రి

పెళ్లికి ముందు పెద్ద షాక్.. వధువు తల్లితో పారిపోయిన వరుడి  తండ్రి
x
Representation Image
Highlights

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాత్కాలిక సూఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాత్కాలిక సూఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కాగా.. వైవాహిక జీవితంలో అడుగుపెట్టాల్సిన ఓ జంట పెళ్లి నిశ్చయం అయిన తర్వాత పెళ్లి పెటాకులు అయింది. అది వధువు తల్లి, వరుడు దండ్రి చేసిన ఓ ఘనకార్యంతో అంటే ఆశ్చర్యం కలగక మానదు. బాలీవుడ్ చిత్రం Hum Aapke Hain Koun సినిమాను తలదన్నే ఈ యదార్థ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని కటార్ గ్రాంకి చెందిన ఓ వ్యక్తి (48), నవ్సారీకి చెంది మహిళ(46) ఇరుపొరుగు కుటుంబాలు కావడంతో చాలా కాలంగా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇరుకుంటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి. వారి కుంటుంబాలకు చెందిన కొందరు పెద్దలు సదరు మహిళ కూతురిని, ఆ వ్యక్తి కొడుకుకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయింయాచారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడు తండ్రి, వదువు తల్లి జనవరి 10 నుంచ కలిపించకుండా పోయారు.

ఈ పెళ్లి జరిగితే వరుసకు వరుడి తండ్రి, వధువు తల్లి అన్నాచెల్లెళ్లు అవుతారు. దీంతో వారు కనిపించకుండా పోయారు. అయితే వారిద్దరి నడుమ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉండడంతో పెళ్లి జరిగితే అన్నాచెలెళ్లు అవ్వాల్సి వస్తుందని దీంతో ఇద్దరు కలిసి చెప్పపెట్టకుండా పారిపోయారు. ‎

కాగా.. వధువు తల్లి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈలోగా పెళ్లికొడుకు తండ్రి కూడా కనిపించపోవడంతో కావడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరిద్దరు మంచి స్నేహితులు కావడం ఒకరంటే ఒకరికి వివాహేతర సంబంధం ఉండడంతో ఇద్దరు పారిపోయారని బంధువులు అనుమానిస్తున్నారు. దీంతో బంధువులు పిల్లల పెళ్లి అపేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories