Supreme Court: ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణకు సుప్రీం మార్గదర్శకాలు.. త్వరగా విచారించాలని హైకోర్టులకు ఆదేశం

Supreme Guidelines For Trial Of Cases Filed Against Leaders
x

Supreme Court: ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణకు సుప్రీం మార్గదర్శకాలు.. త్వరగా విచారించాలని హైకోర్టులకు ఆదేశం

Highlights

Supreme Court: ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

Supreme Court: ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. నేతలపై దాఖలైన కేసుల విచారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు సూచించింది. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని సుప్రీం ఆదేశించింది. దోషిగా తేలిన ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామన్న ధర్మాసనం ..ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories