Supreme Court: దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం'పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

Supreme Court Refuses to Entertain Plea of 14 Parties Alleging Misuse of Central Probe Agencies
x

Supreme Court: దర్యాప్తు సంస్థల ‘దుర్వినియోగం’పై పిటిషన్‌.. ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌..!

Highlights

Supreme Court: 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ

Supreme Court: దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు తీసుకునేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీబీఐ, ఈడీ అరెస్టు అధికారాలను దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తూ అరెస్టుల సమయంలో పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను కోరుతూ కాంగ్రెస్ సహా 14 విపక్ష రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్ తిరస్కరించిన అనంతరం సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ముందుకు 14 పార్టీలు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రతిపక్షాల పాత్ర తగ్గిపోతుందని కోర్టులను ఆశ్రయించడం సరికాదని, రాజకీయాలే ప్రతిపక్షాలకు వేదికని సూచించింది.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని పిటిషన్‭లో విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ వ్యతిరేకతను అణిచివేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలను ఎక్కువ కాలం జైలుకు పంపేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని పిటిషన్‭లో పేర్కొన్నారు. 2013-14లో 209 ఈడీ కేసులు నమోదయితే, 2021-22లో ఇవి 1,180కి పెరిగాయిని అన్నారు. 2014 నుంచి విచారణలో ఉన్న 121 మంది రాజకీయ నాయకులలో 95శాతం పైగా ప్రతిపక్ష నేతలపైనే కేసులున్నాయని పిటిషన్‭లో విపక్షాలు పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories