Supreme recalls BS4 vehicles sales: బీఎస్ -4 వాహనాల విక్రయం విషయంలో సుప్రీం కీలక నిర్ణయం

Supreme recalls BS4 vehicles sales:   బీఎస్ -4 వాహనాల విక్రయం విషయంలో సుప్రీం కీలక నిర్ణయం
x
Supreme Court recalls BS4 vehicles sale and registration
Highlights

Supreme recalls BS4 vehicles sales: మార్చి 31 తర్వాత విక్రయించే బీఎస్ -4 వాహనాల నమోదును అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.

Supreme recalls BS4 vehicles sales: మార్చి 31 తర్వాత విక్రయించే బీఎస్ -4 వాహనాల నమోదును అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. ఢిల్లీ మినహా మార్చి 25 న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కోల్పోయిన ఆరు రోజుల వరకు అమ్ముడుపోని బిఎస్-4 వాహనాలను విక్రయించడానికి 10 రోజుల పాటు అనుమతి ఇస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం మార్చి 27 న తెలిపింది. అయితే ఇందులో పది శాతానికంటే ఎక్కువగా జరిగినట్టు గుర్తించింది. దాంతో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రీకాల్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలు నిర్ణయం తీసుకున్నారు. ఆటోమొబైల్ డీలర్లు కోర్టు ఇచ్చిన సూచనలను ఉల్లంఘించారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వాహనాల విక్రయానికి మార్చి 31 వరకూ మాత్రమే సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చిందని..

ఆ తర్వాత కూడా విక్రయించడం ద్వారా కోర్టు ఆదేశాల దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్బంగా 31 మార్చి 2020 తర్వాత బీఎస్ -4 వాహనాన్ని విక్రయిస్తే, అది నమోదు చేయబడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 3% నుండి 40% తగ్గింపుతో ఆన్‌లైన్‌లో వాహనాలు ఎలా అమ్ముడయ్యాయి? అది కూడా మార్చి 31 తర్వాత ... ఇది మోసం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మార్చి 31 తర్వాత ఈ-వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన వాహనాల డేటాను తన ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం. ఆటోమొబైల్ డీలర్ల సంఘం వారు విక్రయించిన వాహనాల వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ జూలై 23 కు ధర్మాసనం వాయిదా వేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories