జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
x
Highlights

జమ్ము కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై నిషేధం, భద్రతా పరమైన ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌నెట్‌ నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని...

జమ్ము కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై నిషేధం, భద్రతా పరమైన ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌నెట్‌ నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది.

ఆర్టికల్‌ 19లో ఇది ఓ భాగమని వ్యాఖ్యానిస్తూ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని అత్యవసర సేవలకు ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇంటర్‌నెట్‌ నిషేధంపై వారంలోగా సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్‌, నిత్యావసవర సేవలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించాలని పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories