దిశ ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court Key Commands on Disha Encounter Case | Live News Today
x

దిశ ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Highlights

Supreme Court - Disha Encounter: కేసు తదుపరి విచారణ, చర్యలపై తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుంది...

Supreme Court - Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని చెప్పాలని ప్రభుత్వ అడ్వకేట్‌కు సుప్రీంకోర్టు సూచించింది.

ఈ విషయమై 10 నిమిషాల సమయం ఇచ్చింది. మరోవైపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బయటపెట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది పట్టుబడ్డారు. అయితే ఈ నివేదిక బయటకు వస్తే సమాజంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

ఈ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయలేమని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయలేదని, కేసు తదుపరి విచారణ, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందన్నారు. సిర్పూర్కర్‌ కమిషన్‌ సవివర నివేదిక, పలు సూచనలు చేసిందని, ఆ నివేదికను హైకోర్టుకు పంపుతామన్నారు. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టే నిర్ణయిస్తుందని సుప్రీం పేర్కొంది. మరోవైపు విచారణకు మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories