పీఎం కేర్స్‌ ఫండ్‌పై పిల్‌.. రేపు విచారణ

పీఎం కేర్స్‌ ఫండ్‌పై పిల్‌.. రేపు విచారణ
x
Supreme court
Highlights

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఎదురవుతున్న అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అలాగే బాధితులకు ఉపశమనం కలిగించే ప్రాధమిక లక్ష్యంతో మార్చి 28 న ప్రధానమంత్రి పిఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు.

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఎదురవుతున్న అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అలాగే బాధితులకు ఉపశమనం కలిగించే ప్రాధమిక లక్ష్యంతో మార్చి 28 న ప్రధానమంత్రి పిఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు.. దీనికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫిషియో చైర్మన్ అయితే.. రక్షణ, హోం మరియు ఆర్థిక మంత్రులు ఎక్స్-అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు.

అయితే పీఎం కేర్స్‌ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్‌) దాఖలైంది. దీనిపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా పిఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిఎల్‌ను దాఖలు చేశారు.

కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టికల్‌ 267 ప్రకారం దీనిని పార్లమెంట్‌ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ ఆమోదించలేదని. అలాగే దీనికి రాష్ట్రపతి గానీ ఆమోదం తెలపలేదని శర్మ ఆ పిల్‌లో పేర్కొన్నారు.

అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్‌ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా బదిలీ చేయాలని కోరారు. దీనిపై సోమావారం చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఎంఎం శాంతనగౌదర్‌ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories