Supreme Court: మీరేం అమాయకులు కాదు.. బాబా రాందేవ్, బాలకృష్ణ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court Expressed Its Anger On Baba Ramdev And Balakrishna
x

Supreme Court: మీరేం అమాయకులు కాదు.. బాబా రాందేవ్, బాలకృష్ణ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Highlights

Supreme Court: కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు హాజరైన బాబా రాందేవ్

Supreme Court: పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యిది. కోర్టు ధిక్కరణ కేసులో ఇవాళ వీరిద్దరూ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పతంజలి ఆయుర్వేద మెడిసిన్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ తప్పులకు బేషరతుగా సారీ చెబుతున్నామని బాబా రాందేవ్ కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ ఏ.అమానుల్లాతో కూడిన ధర్మాసనం సీరియస్‌గా స్పందించింది.

గత ఉత్తర్వుల్లో మేం ఏం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరంటూ బాబా రాందేవ్, బాలకృష్ణను ఉద్దేశించి సీరియస్ అయ్యింది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా? ఇది బాధ్యతారాహిత్యం కాదా? అంటూ మండిపడింది. అల్లోపతి వైద్య విధానాన్ని తక్కువ చేసి చూపించకూడదని తేల్చి చెప్పిది. సారీ చెప్పినా.. ఇప్పుడే ఈ కేసు నుంచి విముక్తి కల్పించలేమని, వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories