Supreme Court: ఉచిత పథకాలు మంచివి కావు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Comments On Freebies
x

 ఉచిత పథకాలు మంచివి కావు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Highlights

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయా పార్టీలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పింది.

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయా పార్టీలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని తెలిపింది. దురదృష్టవత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఆసక్తి చూపడంలేదని అభిప్రాయపడింది. ఉచిత రేషన్, డబ్బులు అందుతున్నాయని.. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉధ్దేశాలు మంచివేనని.. కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. అయితే ఉచితాల ద్వారా అలా జరుగుతోందా..?అని ప్రశ్నిస్తోంది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించే పద్ధతి సరైంది కాదని.. వాటి వల్ల లబ్దిదారులను పరాన్నజీవులుగా మారుస్తున్నామని జస్టిస్ బిఆర్. గవాయ్ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం పని చేస్తుందో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories