ఉద్యోగులకు శుభవార్త.. పెన్షన్ భారీగా పెరిగిందోచ్..

ఉద్యోగులకు శుభవార్త.. పెన్షన్ భారీగా పెరిగిందోచ్..
x
Highlights

ఉద్యోగం చేస్తున్నంత కాలం బానే ఉంది. కానీ రిటైర్మెంట్ తీసుకున్న తరువాత లైఫ్ ఎలా ఉంటుందో. వచ్చే పెన్షన్ సరిపోతుందో లేదో అని ఇప్పట్నించే టెన్షన్ అని...

ఉద్యోగం చేస్తున్నంత కాలం బానే ఉంది. కానీ రిటైర్మెంట్ తీసుకున్న తరువాత లైఫ్ ఎలా ఉంటుందో. వచ్చే పెన్షన్ సరిపోతుందో లేదో అని ఇప్పట్నించే టెన్షన్ అని పెద్దవాళ్లు, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు వాపోతుంటారు. మరేం భయపడక్కరలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి చివరి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. దీంతో ఈపీఎఫ్‌వో దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులోకేసు వేసింది. అయితే సుప్రీం ఈ అప్పీల్‌ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అయితే అదే సమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్లనుంది.

ఈపీఎస్‌ను ఇలా లెక్కిస్తారు..

కేంద్ర ప్రబుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ రూ. 6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ అకౌంట్‌కు నెలకు గరిష్టంగా రూ.541 జమ అవుతాయి. 1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. 2014లో సెప్టెంబర్ 1న మరోసారి ఈ నిబంధనలను సవరించింది. గరిష్టంగా కూ.15,000 ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. దీన్నిబట్టి నెలకు గరిష్టంగా రూ.1250లు ఈపీఎస్ ఖాతాలో జమ అవుతోంది. అయితే ఇక్కడ ఈపీఎఫ్‌వో ఒక తిరకాసు పెట్టింది. పూర్తి వేతనంపై పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే.. గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. అంతే తప్ప గత ఏడాది వేతన సగటును ప్రాతిపదికన తీసుకోమని తెలిపింది. దీంతో ఉద్యోగులు కేరళ కోర్టు మెట్లు ఎక్కారు. వారి ప్రయత్నం ఫలించి 2014 సెప్టెంబర్ 1 మార్పులను పక్కన పెట్టింది. పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. ఈపీఎస్‌లో జమ అయ్యే విధానం ఉద్యోగుల వేతనంలో 12 శాతం మొత్తం ఈపీఎఫ్‌కి జమ అవుతుంది. కంపెనీలు కూడా 12 శాతం మొత్తాన్న జమచేస్తాయి. ఇందులో 3.67 శాతం ఈపీఎప్‌కు వెళుతుంది. ఇక మిగతా 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories