Supreme Court: మణిపుర్‌ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీం ఆగ్రహం..

Supreme Court Anger Over The Negligence Of Manipur Police
x

Supreme Court: మణిపుర్‌ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీం ఆగ్రహం.. 

Highlights

Supreme Court: ఎఫ్ఐఆర్ దాఖలుకు 14 రోజులు ఎందుకు పట్టింది?

Supreme Court: మణిపుర్ ఘర్షణల్లో మహిళలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపుర్‌లో వెలుగులోకి వచ్చిన వీడియో ఘటన, రాష్ట్రంలోని ఘర్షణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మణిపుర్‌లో వీడియో ఘటన ఒక్కటి మాత్రమే జరగలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వీడియో ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలుకు 14 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కమిటీలో మహిళా జడ్జీలతో పాటు నిపుణులు ఉంటారని తెలిపింది. తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories